ఓయ్ పిల్లా...
కంటి నిద్రే దోచుకెళ్ళావ్..
ఆశలన్నీ జల్లి వెళ్ళావ్..
నేను, నా లోకం అంటూ నేనుంటే..,
ఈ మాయదారి లోకంలోకి తీసుకొచ్చావ్... ఓయ్ పిల్లా..!!!


మెుట్ట మెుదటి సారి నిన్ను చూసినపుడు,
నాలో ఏ భావం కలగలేదు...
స్వతహగా నాకు నా చుట్టు వున్నవారిని
గమనించడం సరదా...
అలాగే నిన్ను గమనించినపుడు అనుకున్నాను..,
నిజంగానే అందంగా వుంటే ఇంకా పట్టుకోలేక పోదుమేమో నని...
కానీ ఇప్పుడు,
నీవు తప్ప ఏదీ.. అపురూపం కాదంటుంది ఈ మనసు
ఇంత అందం ప్రపంచంలో ఎక్కడా లేదంటుంది... ఓయ్ పిల్లా..!!!


Varu Varnesh

Latest
Previous
Next Post »